ADB: నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ పట్టణంలోని ప్రజలను కలుస్తూ రైతులు, కార్మికులు, యువతకు చేస్తున్న అన్యాయాన్ని వారికి వివరించారు. స్వతంత్ర భారతంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకం అని అన్నారు. ప్రజలు సీపీఐ పార్టీని ఆదరించాలని కోరారు.