RR: కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ అమ్మవారి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో కేశంపేట మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.