NGKL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి భక్తులు మానవత్వంతో రోగులకు, వారి సహాయకులకు అన్నప్రసాద పంపిణీ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఈ సేవా కార్యక్రమం నిర్వహించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు సత్యసాయి భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.