NRPT: మక్తల్ పట్టణంలో ఈ నెల 6న జరగనున్న ‘హిందూ సమ్మేళనం’ పురస్కరించుకుని ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ.. స్థానిక రామ్ లీలా మైదానం నుంచి పుర వీధుల గుండా ఈ ర్యాలీ సాగుతుందన్నారు. కార్యకర్తలు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.