SRD: పటాన్చెరు జేపీ కాలనీలోని తిమ్మక్క చెరువు నిండా గుర్రపు డెక్క పర్చుకుంది. చెరువు సమీపంలో నివాసం ఉన్న వారు చెరువు అంచున చెత్తను పారబోస్తున్నారు. బతుకమ్మ ఘాట్ మెట్లపై చెత్త కవర్లు పారవేస్తున్నారు. చెరువులోకి డ్రైనేజీ మురుగు చేరి అపరిశుభ్రతతో దోమలు విజృంభిస్తున్నాయని బస్తీ వాసులు తెలిపారు. గుర్రపు డెక్కను సత్వరమే తొలగించాలని కోరుతున్నారు.