NZB: నవీపేట్ మండలం మల్కాపూర్ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు సీజ్ చేశారు. శనివారం సాయంత్రం పోలీసులు దాడి చేసి టిప్పర్ను పట్టుకున్నారు. టిప్పర్ స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.