ప్రేమపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ కోసం హద్దులు దాటే సమయం వస్తోందని.. అది రాగానే తప్పకుండా అందరికీ చెబుతా అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు SMలో వైరల్ అవుతున్నాయి. కాగా, మృణాల్ గతంలోనూ ప్రేమ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. తొలిచూపు ప్రేమను తాను నమ్ముతానని, ఆడవాళ్లు భావోద్వేగాలను మరిచిపోలేరని తెలిపింది.