RR: బాటసింగారం పండ్ల మార్కెట్‌ను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సందర్శించి మామిడి క్రయవిక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను కమీషన్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, అధిక రసాయనాలు వాడిన లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వ్యాపారులకు, వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు.