‘బైసన్’ సినిమా తర్వాత కోలీవుడ్ యువ హీరో ధృవ్ విక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ (DV4)పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘సూర్య కరుప్పు’ రచయిత కరణ్ అరవింద్ కుమార్ దీనికి దర్శకత్వం వహించనుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.