GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించారు. అర్జీలను పరిశీలించిన ఆమె.. సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు.