AP: భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మోదీకి సీఎం ఆహ్వానం పలికినట్లు సమాచారం. కాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జూలై 5 లేదా 8న ప్రారంభించే అవకాశం ఉంది. విమానాశ్రయ పనులు త్వరగా పూర్తి చేయాలని GMRను ప్రభుత్వం కోరింది. జూన్ 30లోపు పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలిచ్చింది.