NZB: రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాంపంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు కందకుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.