JNG: లింగాల గణపురం మండలంలోని బల్లగూడ కస్తూర్బా పాఠశాలను శనివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. బోధన విధానం, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. గణిత బోధనపై ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చి, పదో తరగతి విద్యార్థులు పునశ్చరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందిని కోరారు.