RR: రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి గోపి తెలిపారు. 16 ఏళ్లు పైబడిన వారికి అండర్- 20 మెన్ & ఉమెన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.