MHBD: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 482 గ్రామ పంచాయతీలకు 416 మంది కార్యదర్శులు పనిచేస్తుండగా, వారిలో 406 మందిని డిప్యుటేషన్‌పై నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.