KMR: ఎల్లారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అన్నారు. మండలంలోని అన్న సాగర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.