KMM: గజ్వేల్లో కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంఛార్జ్ లింగాల కమల్ రాజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోవడం ఆందోళనకరమన్నారు.