సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మూవీ ‘వారణాసి’. తాజాగా ఈ సినిమాపై నయా న్యూస్ బయటకు వచ్చింది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మహేష్ ‘శ్రీరాముడి’ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.