CTR: గత ఐదేళ్లుగా జీడీనెల్లూరు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి మాజీ సర్పంచ్లు చూపిన చొరవ మరువలేనిదని మాజీ మంత్రి నారాయణస్వామి, వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి తెలిపారు. ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లె మిట్టలో గతంలో గెలిచిన సర్పంచ్లను, వార్డు సభ్యులను సన్మానించారు. పదవీకాలం ముగిసినప్పటికీ ప్రజాసేవను కొనసాగించాలని కోరారు.