ATP: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన నలుగురు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తాడిపత్రి సీఐ ఆరోహణరావు తెలిపారు. అంబేద్కర్ నగర్‌కు చెందిన రాజు, రవి, వినయ్, శివ గతంలో బైండోవర్ అయ్యారు. అయితే ఈనెల 18న యల్లనూరు రోడ్డులో అల్లర్లకు పాల్పడి నిబంధనలు అతిక్రమించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన మండల మేజిస్ట్రేట్ సోమశేఖర్ వారికి నెల రోజుల రిమాండ్ విధించారు.