ASF: సిర్పూర్-టీ మండలం లోనవెల్లిలో పోలీసులు సైబర్ నేరాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI సాగర్ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులకు OTPలు, బ్యాంకు వివరాలు చెప్పకూడదని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దన్నారు.