NZB: జిల్లా స్థాయి జర్నలిస్టుల బస్సు పాస్‌ల కాలపరిమితిని జూన్ 16 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. TG సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ జీ.ముకుంద రెడ్డి ఈ మేరకు TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ లేఖ రాశారు. అక్రిడిటేషన్ కార్డుల గడువును జూన్ 16 వరకు పొడిగించినందున, బస్సుపాస్‌ల గడువును కూడా పొడిగించాలని ఆర్టీసీ మేనేజ్మెంట్ను కోరారు.