WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో “మన ఊరు – మన అంగన్వాడీ” నినాదంతో బడిబాట కార్యక్రమం శనివారం నిర్వహించారు. సర్పంచ్ బేతి సాంబయ్య చిన్నారులకు స్లేటు, బలపాలు అందించి అక్షరాభ్యాసం చేయించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్య అందుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ డిబోరా, కార్యదర్శి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.