TG: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. రైతులకు కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయడం లేదని, అన్నదాతల పట్ల ప్రభుత్వానికి అస్సలు శ్రద్ధ లేదని మండిపడ్డారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వ ఉండిపోయిందని, రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.