KMM: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని DMHO డా. రామారావు అన్నారు. ఖమ్మం TTDCలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో DMHO పాల్గొన్నారు. ఈ సందర్భంగా DMHO.. మహిళలకు పోషణ, రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, ఉన్నత విద్య, బాల్యవివాహం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.