AP: కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతినగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త మహేష్‌ను భార్య ఈరమ్మ గొంతు నులిమి చంపింది. సమాచారం తెలుసుకున్న 1వ పట్టణ పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.