TG: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రక్రియపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘SIR’ వల్లే ఓడిపోయామనడం తప్పని, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ‘SIR’ అంశంపై రాజకీయాలు చేయవద్దని ఆయన హితవు పలికారు.