NRML: స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు ప్రమీల అగర్వాల్ శనివారం జిల్లాలో పర్యటించారు. మామడ మండలం జగదాంబ తండా అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, పిల్లల పరిస్థితులు తెలుసుకుని పోషకాహారం సమయానికి అందించాలని సూచించారు. అనంతరం కొండాపూర్ బాలసదనాన్ని సందర్శించి, పిల్లల సంరక్షణపై సిబ్బందికి మార్గదర్శకాలు ఇచ్చారు.