WGL: మొక్కజొన్న కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల చేతుల్లో మోసపోయి వేల రూపాయలు నష్టపోతున్నారని అఖిల భారత రైతు సమైక్య(ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్ అన్నారు. శనివారం పర్వతగిరి మండలం ఏనుగల్లో రైతులతో సమావేశం నిర్వహించి, ఈ మేరకు ఈనెల 7న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని, రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.