AP: పల్నాడు జిల్లాలో అప్పుల బాధతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధపడిన అమరేంద్రను భార్య త్రివేణి చాకచక్యంగా రక్షించింది. పిల్లల ఆరోగ్యం బాలేదని నమ్మించి కారులో తీసుకెళ్తున్న భర్త కుట్రను గమనించి, రహస్యంగా బంధువులకు సమాచారం ఇచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా కారును అడ్డగించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.