BDK: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించాలని ఎంపీవో షాభానా అన్నారు. అన్నపురెడ్డిపల్లిలోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటగది, భోజనశాల, వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లను పరిశీలించడంతో పాటు స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజన సౌకర్యాలపై ఆరా తీశారు.