MBNR: మూసాపేట మండలంలోని తాళ్లగడ్డ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నారాయణ గౌడ్, సురేంద్రమ్మ, యాదయ్య సహా పలువురు ఎమ్మెల్యేకు పూలమాల వేసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జీఎంఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.