AP: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా నెదర్లాండ్స్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి TTD శ్రీకారం చుట్టింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సుమారు 33 ఎకరాల్లో రూ.250 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. శిల్పకళా సౌందర్యం కోసం TTD నుంచి స్థపతి సహకారం అందించాలని నిర్ణయించారు. విదేశాల్లో శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు TTD చైర్మన్ తెలిపారు.