W.G: ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైనది కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉండి పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఇళ్ల బయట, మేడపైన, ఆవరణలో నిద్రిస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని రాత్రి వేళల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందన్నారు. బంగారం, నగదు, సెల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను బయట, తలగడ పక్కన ఉంచకూడదన్నారు.