సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం ‘కరుప్పు’. ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారైంది. సూర్య సరసన త్రిష నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మే 14 ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.