NDL: డోన్ మండలం చిన్న మల్కాపురం సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణ పనుల కోసం వేసిన కంకర కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు కంకరపై వాహనం జారి కిందపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు గుర్తించి వెంటనే డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.