ADB: బోథ్ నియోజకవర్గంలో రూ. 200 కోట్ల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసింది. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన పట్టుదలతో ఎన్నో సార్లు అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై గళమెత్తడంతో ఇది సాధ్యమైందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.