MLG: ఈనెల 18న ములుగు మంజునాథపురంలో జరగనున్న హిందూ సమ్మేళనానికి కమిటీ ఆధ్వర్యంలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రావణ వధ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానికంగా విస్తృతంగా సమన్వయం కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.