GNTR: రమేష్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల రోగికి మత్తు ఇవ్వకుండా మెలకువలోనే గుండె బైపాస్ ఆపరేషన్ చేశారు. గతంలో క్యాన్సర్ చికిత్సల వల్ల సదరు రోగి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. సాధారణ మత్తు ఇస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు భావించారు. దీంతో డాక్టర్ల బృందం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఈ సర్జరీని పూర్తి చేశారు.