TG: నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టే అని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నియోజవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది నుంచి కేంద్రమంత్రిగా బండి సంజయ్ ఉన్నారని గుర్తుచేశారు. దక్షిణాదికి అన్యాయం జరగకుండా బండి సంజయ్ చూడాలని పేర్కొన్నారు.