RR: శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అనేక కుటుంబాలకు స్థిరనివాసం కల్పించబడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.