NZB: సిరికొండ మండలంలోని ఉపాధి హామీ పని ప్రదేశంలో సోమవారం కనీస సదుపాయాలు లేకపోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారు. ప్రారంభంలో కూలీలకు గడ్డపారలు, మెడికల్ కిట్లు, టెంట్లు, తాగునీరు, వసతులు కల్పించే వారు. రాను రాను వారికి ఎటువంటి వసతులు కల్పించడం లేదు. రోజు రోజుకు ఎండలు మండిపోతుండటంతో అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.