PPM: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా 9 మంది వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.