రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పరిధిలో నిర్మాణ పనుల సమయంలో కరెంట్ షాక్తో కార్మికుడు నాగరాజు (41) నిన్న మృతి చెందాడు. 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. మరో కార్మికుడు మల్లయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.