ప్రకాశం: దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 7న సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జూలై-ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీటి విడుదల లక్ష్యంగా పనుల పురోగతిని పరిశీలించనున్నారు. మంత్రి పర్యటన ఇప్పటికే ఖరారైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.