SRCL: మహనీయుల చరిత్రను ఈ తరం వారికి చెప్పాల్సిన బాధ్యత సామాజిక ఉద్యమకారులపై ఉందని, ప్రభుత్వ విప్ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ప్రభుత్వవిప్, ఆవిష్కరించారు.