TPT: శ్రీకాళహస్తి మండలం ఊరందూరులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన ఇక్కడ మే 6 బుధవారం వరకు 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు.