CTR: పుంగనూరులోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణి అలంకారంలో అమ్మవారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామాలతో పూజలు నిర్వహించగా రాహుకాల పూజకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.