TG: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా ఆదిలాబాద్లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ 44.3, మెదక్ 42.4, రామగుండం 41.6, మహబూబ్నగర్ 41.4, ఖమ్మం 41.4, భద్రాచలం 41.2, నల్లగొండ 40.5, హైదరాబాద్ 40, హకీంపేట్ 40.8, హనుమకొండలో 40 డిగ్రీలు దాటింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.