AP: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని CM చంద్రబాబు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించాలని సూచించారు. సాయంత్రానికి మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని అధికారులు CMకి వివరించారు.